Hero Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్.. ‘రాజ్ లేని జీవితం నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్ కు మెసేజ్ పెట్టిన లావణ్య
యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్ కు మెసేజ్ పంపించింది.
Hyderabad, July 13: యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో (Hero Raj Tarun Case) కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు (Police) ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్ కు మెసేజ్ పంపించింది. వెంటనే స్పందించిన లాయర్.. డయల్ 112 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
మెసేజీలో ఏం పేర్కొన్నదంటే?
‘రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’ అంటూ లావణ్య అడ్వకేట్ కు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన, ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం
(The above story first appeared on LatestLY on Jul 13, 2024 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

