AR Rahman: రీమిక్స్ చేస్తే వక్రీకరించినట్టే.. ఒకరి కష్టాన్ని గౌరవించాలి.. నేనైతే ముందస్తు అనుమతి తీసుకుంటా.. పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ఏఆర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు
కొంత మంది సంగీతకారులు పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇలాంటివన్నీ వక్రీకరణలేనన్నారు. కంపోజర్ ఉద్దేశ్యం సైతం వక్రీకరణకు గురవుతుందన్నారు.
Hyderabad, September 27: కొంత మంది సంగీతకారులు పాత పాటలను రీకంపోజ్ (Recompose), రీమిక్స్ (Remix) చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్పందించారు. ఇలాంటివన్నీ వక్రీకరణలేనన్నారు. కంపోజర్ ఉద్దేశ్యం సైతం వక్రీకరణకు గురవుతుందన్నారు. ‘తాము తిరిగి సృష్టిస్తున్నామని కొందరు చెబుతుంటారు. తిరిగి సృష్టించడానికి మీరెవరు?’ అని రెహమాన్ ప్రశ్నించారు. ఒకరు చేసిన కష్టాన్ని తీసుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో
ఒకరి కష్టాన్ని గౌరవించాల్సి (Respect to the efforts) ఉంటుందన్నారు. మరి నిర్మాతలు, దర్శకులు తాము గతంలో చేసిన పాటలకు రీమిక్స్, రీమేకింగ్ చేయాలని కోరితే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు కూడా రెహమాన్ స్పందించారు. తాను ఇదే చేయాల్సి వస్తే, ఈ విషయంలో ముందుగానే అనుమతి తీసుకుంటానని చెప్పారు. కాకపోతే ఇటీవలే వచ్చిన దాన్ని రీమేక్ చేయరాదన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 27, 2022 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

