ఇన్ స్టాగ్రాం రీల్స్ ద్వారా ఫేమస్ అయిన శాంతి అలియాస్ ఇన్ స్టా గ్రామ్ బంగారం అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా, శాంతి చేసే ఇన్ స్టాగ్రాం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ అమ్మాయిని అటు మల్లెమాల వారుసైతం పిలిచి ప్రోగ్రాం చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న జ్యోతి గురించి పలు యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిజాలు బయటకు వస్తున్నాయి. నిజానికి శాంతిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఈ అమ్మాయి ఓ పేదింట్లో జన్మించింది. బట్టల షాపులో పనిచేస్తుంది. తండ్రి ఇల్లు వదిలి పారిపోయాడు.
ఇక తాజాగా శాంతి తన తల్లి గురించి చెప్పింది. తన తల్లిని తండ్రి తరపు బంధువులు జుట్టు పట్టి లాగి కొట్టారని, తన తండ్రి మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్లిపోయారని, అయితే బంధువులు మాత్రం తన తల్లే, ఆయనను చంపేసిందని పుకారు పుట్టించారని, అంతేకాదు ఆమెను చితకబాదినట్లు తెలిపింది.
View this post on Instagram
అయితే ఇన్ స్టా గ్రాం ద్వారా ఫేమస్ అయిన శాంతికి ఇటీవలే జబర్దస్త్ నుంచి అవకాశం దక్కింది. తనకు సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది. ఇటీవలే ఓ సంస్థ శాంతికి సోషల్ మీడియా అవార్డ్ ఇచ్చింది.