Bangarraju Teaser: కొడుకుతో కలిసి నాగార్జున రచ్చ, సంక్రాతికి వచ్చేస్తున్నామంటూ టీజర్ రిలీజ్ చేసిన బంగార్రాజు టీమ్, ఫుల్ ఖుషీగా నాగ్, చై ఫ్యాన్స్
ఫ్యాన్స్ కు న్యూఇయర్ కానుక(New Year Treat) ఇచ్చారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బంగార్రాజు’(Bangarraju) చిత్రం టీజర్ రిలీజైంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య(Naga Chaithanya)తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
Hyderabad January 01: ఫ్యాన్స్ కు న్యూఇయర్ కానుక( New Year Treat) ఇచ్చారు కింగ్ నాగార్జున (Nagarjuna). ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బంగార్రాజు’(Bangarraju) చిత్రం టీజర్ రిలీజైంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య (Naga Chaithanya) తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ‘బంగార్రాజు’ టీజర్ (Bangarraju Teaser) ను విడుదల చేసింది.
ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna), నాగచైతన్య(Naga Chaithanya) తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. ‘‘నువ్వు ఈ ఊరికే సర్పంచివి కాదు. మన రాష్ట్రానికే సర్పంచి కావాలి. మన దేశానికే సర్పంచి కావాలి’’ అంటూ కృతిశెట్టితో నాగచైతన్య చెప్పే డైలాగ్‌లు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ఇక, టీజర్ చివర్లో నాగార్జున, చైతన్య నడుచుకుంటూ వచ్చే సీన్‌లు.. హైలైట్‌గా ఉన్నాయి. చైని చూసి నాగ్ ఆనందంతో నవ్వుతూ మీసం మెలిపెట్టే సీన్ ఈలలు వేయించేలా ఉంది.
2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’(Soggade chinninayana) చిత్రానికి ప్రిక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ.. చైతన్యకు జంటగా కృతిశెట్టి(Kruthi shetty) సందడి చేయనున్నారు. నాగబాబు(nagababu) అతిథి పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్(anup rubens) స్వరాలు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios), జీ స్టూడియోస్(Zee studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 2022 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

