Bheemla Nayak Trailer Talk: నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ , యూట్యూబ్ లో సంచలనంగా మారిన భీమ్లా నాయక్ ట్రైలర్, పోలీసు గెటప్పులో అదరగొట్టిన పవర్ స్టార్...
పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రానా (Rana) ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak)ట్రైలర్ కూడా వచ్చేసింది. కచ్చితంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రానా (Rana) ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak)ట్రైలర్ కూడా వచ్చేసింది. కచ్చితంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 25న విడుదల అవుతుంది.
ఒరిజినల్ లో ఉన్న ఫీల్ పోకుండా.. తెలుగు ఆడియెన్స్ కు తగ్గట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే యాడ్ చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇన్ని రోజులు పోస్టర్స్ లో రానా దగ్గుబాటిని పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన పాత్ర బలంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు అని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆత్మాభిమానం.. ఒక డబ్బున్న వ్యక్తి ఈగో మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి తోడు ట్రైలర్లో అటు పవన్.. ఇటు రానా ఇద్దరు సరిసమానంగా కనిపించారు. ఎవరినీ తక్కువ చేయకుండా సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారు.
రేపు సినిమాలో కూడా ఇదే జరుగుతుందని దగ్గుబాటి అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులకు టైలర్ ఓ రేంజ్లో కిక్ ఇస్తుంది. నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అంటూ రానా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్. మొత్తానికి భీమ్లా నాయక్ ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేసింది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.
(The above story first appeared on LatestLY on Feb 22, 2022 12:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

