Pune Shocker: పుణేలో దారుణం, పడుకోవడానికి రాలేదని సెక్స్ వర్కర్‌పై బ్లేడుతో దాడి చేసిన విటుడు, మరో ఘటనలో ఢిల్లీలో 87 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు
Arrested| Representational Image (Photo Credit: ANI)

Pune, Feb 14: మ‌హారాష్ట్ర‌లోని పుణే రెడ్‌లైట్ ఏరియా బుధ‌వార్‌పేట‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.డ‌బ్బు వ్య‌వ‌హారంలో వివాదం చెల‌రేగ‌డంతో 35 ఏండ్ల సెక్స్ వ‌ర్క‌ర్‌పై పుణే విటుడు (40) బ్లేడ్‌తో దాడి చేసి గాయపరిచాడు. నిందితుడు రాజ‌ప్ప సిద్ధ‌లింగ‌ప్ప మ‌హిళ ఛాతీ కింద భాగంలో షేవింగ్ బ్లేడ్‌తో దాడి ( attacking a sex worker ) చేశాడ‌ని పోలీసులు తెలిపారు. త‌న‌తో వ‌చ్చేందుకు నిందితుడు ఇవ్వ‌జూపిన మొత్తానికి మ‌హిళ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ (argument) జ‌రిగింద‌ని చెప్పారు.

దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు బాధితురాలిపై బ్లేడ్‌తో దాడి చేశాడ‌ని పోలీసులు తెలిపారు. మ‌హిళ ఫిర్యాదుతో ఘ‌ట‌నా స్ధలానికి చేరుకున్న ఫరస్ఖానా పోలీస్ స్టేషన్ బృందం నిందితుడిని అరెస్ట్ చేసి (Pune man arrested) అత‌డిపై పిసి సెక్షన్ 307 మరియు 506 ప్రకారం హ‌త్యాయ‌త్నం స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసింది. బాధిత మ‌హిళ‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఇక దేశ రాజ‌ధానిలో ఢిల్లీలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. తాజా ఘ‌ట‌న‌లో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియ‌ని వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆదివారం డిల్లీలో క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని తిల‌క్‌న‌గ‌ర్‌లో మంచానికి ప‌రిమిత‌మైన మ‌హిళ‌పై నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వృద్ధురాలు కుమార్తె (65) వాకింగ్ చేసేందుకు బ‌య‌ట‌కు వెళ్ల‌గా మ‌ద్యాహ్నం 12.30 గంట‌ల ప్రాంతంలో బాధితురాలి ఇంట్లోకి చొర‌బ‌డిన నిందితుడు 1.30 గంట‌ల ప్రాంతంలో బ‌య‌ట‌కు వెళ్లాడు. నిందితుడు ఇంట్లోకి రాగానే లోప‌లి నుంచి డోర్ వేశాడు.. దీంతో బాధితురాలు ప్ర‌శ్నించ‌గా తాను గ్యాస్ ఏజెన్సీలో ప‌నిచేస్తాన‌ని ఎవ‌రో త‌నను ప‌ని నిమిత్తం పిలిపించార‌ని న‌మ్మ‌బలికాడు.

భర్త తన దగ్గరకు ఎందుకు రావడం లేదని భార్య నిఘా, కట్ చేస్తే ఇంకో ఆవిడతో...న్యాయం చేయాలంటూ వీధుల్లో నిరసనకు దిగిన మహిళా డాక్టర్

అనుమానం వ‌చ్చిన వృద్ధురాలు సాయం కోసం కేక‌లు వేయ‌గా ఆమెను వేధించిన నిందితుడు ఆపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి ఫోన్‌ను దొంగిలించిన నిందితుడు ఆపై ప‌రార‌య్యాడు. కాగా బాధితురాలు త‌న ఫిర్యాదులో దోపిడీ గురించే ఫిర్యాదు చేశార‌ని, లైంగిక దాడి ఘ‌ట‌న గురించి ప్ర‌స్తావించ‌లేద‌ని పోలీసులు తోసిపుచ్చారు. బాధితురాలికి ధైర్యం చెప్పిన పోలీసులు ఆమెకు సంబంధిత నిపుణుల‌తో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్నారు. నిందితుడిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.