Meeku Maathrame Cheptha: ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండ, హీరో తరుణ్ భాస్కర్, 'చాలు చాలు చాలు' లవ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల
ఈ సినిమాను ప్రమోట్ చేయటానికే స్పెషల్‌గా ఒక సాంగ్ కూడా చిత్రీకరించారట. ఆ సాంగ్‌ను కూడా 'సైరా' రిలీజ్ తర్వాత ఇంటర్వెల్‌లో ప్లే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది....
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకవైపు హీరోగా ఇప్పటికే వరుస సినిమాల్లో ఇప్పటికే బిజీగా ఉంటూనే మరోవైపు తనే ఒక సినిమాను స్వయంగా నిర్మిస్తూ దాని ప్రమోషన్ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. తనకు 'పెళ్లిచూపులు' సినిమాతో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ను హీరోగా పరిచయం చేస్తూ 'మీకు మాత్రమే చెప్తా' (Meeku Maathrame Cheptha) అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరిని తీసుకొస్తున్నారు. షమీర్ సుల్తాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన వాణి భోజన్ (Vani Bhojan) హీరోయిన్‌గా నటిస్తుంది. యాంకర్ అనుసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి లాంటి సెలబ్రిటీస్ కూడా ఇందులో నటిస్తున్నారు. వీరితో పాటు తరుణ్ భాస్కర్ సినిమాల్లో కనిపించే కొంతమంది కమెడియన్స్ ఈ సినిమాలో కూడా కామన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తై దాదాపు విడుదలకు సిద్ధంగా ఉంది. మార్కెటింగ్ ట్రిక్స్ బాగా తెలిసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాను స్పెషల్‌గా ప్రమోట్ చేయిస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ 'మీకు మాత్రమే చెప్తా' ట్యాగ్ లైన్ 'మై బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్' కంప్లీట్ యూత్ ఓరియెంటెడ్ స్టోరీ కాబట్టి, యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని తెలంగాణ మరియు ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ సినిమా స్టార్స్ వెళ్లి వారి స్టైల్‌లో సినిమాను ప్రమోట్ చేస్తూ సినిమా పట్ల ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజైంది, సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా "చాలు చాలు చాలు" అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Chaalu Chaalu Lyrical Video:
మెగాస్టార్ 'సైరా నరసింహారెడ్డి' రిలీజైన కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేయటానికే స్పెషల్‌గా ఒక సాంగ్ కూడా చిత్రీకరించారట. ఆ సాంగ్‌ను కూడా 'సైరా' రిలీజ్ తర్వాత ఇంటర్వెల్‌లో ప్లే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 18న ఈ సినిమా విడుదలను షెడ్యూల్ చేశారు.
Here's the teaser:
'ఏసియన్ సినిమాస్' ఈ సినిమా థియేటర్ రిలీజ్ హక్కులను రూ. 2 కోట్లు పెట్టి కొనుక్కున్నట్లు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు, దాని తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా లైన్‌లో ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 26, 2019 08:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

