Vijay Devarakonda's World Famous Lover First Look | Photo- Creative Commercials

రౌడీ స్టార్ - విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ 9వ చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్" (World Famous Lover) ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో చేతిలోని సిగరెట్ విసిరేస్తున్నట్లు ఉన్న హీరో విజయ్ దేవరకొండ ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా (Raashi Khanna), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కేథరీన్ ట్రెసా (Catherine Tresa) మరియు ఇజబెల్లె లీటీ (Isabelle Leite) నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

గతంలో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" లాంటి సైలెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ అలాంటి జోనర్ లోనే చేస్తున్న మూడో సినిమా ఇది.

అయితే తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి కూడా మిక్స్‌‌డ్ రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది బాగుందంటున్నా చాలా మంది మాత్రం గతంలోని అర్జున్ రెడ్డి లేదా డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి ఉపయోంగించని స్టిల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాటిల్లోంచే ఒక స్టిల్ తీసుకొని వరల్డ్ ఫేమస్ లవర్ కోసం కొత్తగా పోస్టర్ తయారు చేసినట్లు ఉందని కమెంట్స్ వస్తున్నాయి.  'వరల్డ్ ఫేమస్ లవర్'  సినిమా అర్జున్ రెడ్డి , డియర్ కామ్రేడ్ సినిమాలకు సీక్వెలా అని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది, హైదరాబాద్‌లో  షూటింగ్  ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుంది.