'Thangalaan' Trailer: చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ కు ఇక పండుగే! అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తంగాలన్ ట్రైలర్, బంగారు గనుల నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా మూవీ
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). పా.రంజిత్ (Pa Ranjit) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
Chennai, July 10: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). పా.రంజిత్ (Pa Ranjit) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ (Malavika Mohanan) కథానాయికలుగా నటిస్తుండగా.. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టైలర్ ను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఓ ఆటవిక తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్ చాలా వైవిధ్యంగా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. బంగారం కోసం అన్వేషిస్తుండగా ఓ మాంత్రికురాలు అడ్డుపడగా.. విక్రమ్ ఆ మాంత్రికురాలిని ఎదుర్కొంటున్నట్లుగా ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మొత్తంగా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
(The above story first appeared on LatestLY on Jul 10, 2024 08:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

