Devara Daavudi Son in Theatres: దేవర అభిమానులకు గుడ్ న్యూస్, రేపటి నుంచి థియేటర్లలోకి దావూదీ సాంగ్
ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.393 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది.
Hyderabad, OCT 03: ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.393 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా నుంచి దావూదీ (Daavudi) అనే సాంగ్‌ను చిత్రయూనిట్ తొలగించిన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పాటను థియేటర్లో చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.
Here's the Video
అయితే తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ పాటను థియేట్రికల్ వెర్షన్‌లో రేపటినుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించారు. చాలా రోజుల తర్వాత తారక్(JrNTR) సోలోగా రావడంతో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (janvi apoor) కథానాయికగా నటించగా. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. యువసుధా ఆర్ట్స్ పతకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.
(The above story first appeared on LatestLY on Oct 03, 2024 09:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

