Dakshayani First Look: వామ్మో అనసూయను చూసి అంతా అవాక్కవుతున్నారు, ఇక ద్రాక్షాయణిగా అనసూయ అదరగొట్టడం ఖాయం

సుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్పకు సంబంధించిన మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ అయింది. ద్రాక్షాయణి రోల్‌ చేస్తున్న అనసూయ లుక్‌ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ లుక్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Dakshayani First Look: వామ్మో అనసూయను చూసి అంతా అవాక్కవుతున్నారు, ఇక ద్రాక్షాయణిగా అనసూయ అదరగొట్టడం ఖాయం

Hyderabad November 10: సుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్పకు సంబంధించిన మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ అయింది. ద్రాక్షాయణి రోల్‌ చేస్తున్న అనసూయ లుక్‌ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ లుక్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

బుల్లితెర, వెండితెరపై తన అందం, అభినయంతో అలరిస్తున్నారు అనసూయ. అయితే పుష్ప మూవీలో ఆమె రోల్‌ పూర్తి డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్‌ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రతో మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు పుష్పలో ద్రాక్షాయణితో తన విలనిజాన్ని చూపిస్తారని బయట టాక్ నడుస్తోంది.

ఓవైపు యాంకర్‏గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తుంది అనసూయ. చివరిగా ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అనే సినిమాలో గ‌ర్భిణిగా కనిపించి మెప్పించిన  అనసూయ ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ సినిమాల్లో నటిస్తుంది.

ఇప్పటికే పుష్ప మూవీకి సంబంధించి అల్లు అర్జున్, రష్మిక, పహాద్ ఫజల్, సునిల్‌లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లు రిలీజ్‌ అయ్యాయి. చిత్తూరు నేపథ్యంలో జరిగే ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించబోతున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 10, 2021 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).