Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad, Nov 5: జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' (Devara) మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సౌత్ భాషల్లో నవంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నది. ఈ మేరకు సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.
బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
హై లెవెల్ గ్రాఫిక్స్ తో..
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై లెవెల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు.
మళ్ళీ పెళ్లి చేసుకున్న శృంగార తార సన్నీ లియోన్, తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన ఫోటోలు వైరల్
(The above story first appeared on LatestLY on Nov 05, 2024 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

