Hyderabad, March 07: చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ కరోనా సమయంలో పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల మళ్ళీ తమిళ్, తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. త్వరలో సత్యభామ, ఇండియన్ 2 సినిమాలతో అభిమానులని పలకరించనుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది కాజల్ (Kajal Aggarwal). షాప్ ఓపెనింగ్స్ లో కూడా పాల్గొంటుంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది కాజల్ అగర్వాల్. కాజల్ ని చూడటానికి అనేకమంది అభిమానులు అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో అనుకోని ఘటన జరిగింది.
Fan/random Guy Misbehaving with actress #KajalAggarwal in a event🙄🙄 pic.twitter.com/I68WdTbxLl
— Movies & Entertainment (@Movies_Ent_) March 6, 2024
ఓ వ్యక్తి అభిమాని అంటూ సెల్ఫీ (Fan Misbehaving) తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు. ఈ సంఘటనతో కాజల్ షాక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమాని అని చెప్పి హీరోయిన్ తో ఇలా మిస్ బిహేవ్ చేయడమేంటి అంటూ నెటిజన్లు ఆ వ్యక్తిపై సీరియస్ అవుతున్నారు.