Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సీక్రెట్ బయటపెట్టిన కమల్ హాసన్, విలన్‌గా ఎందుకు ఒప్పుకున్నారనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేసిన స్టార్ హీరో
కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్‌కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేశారు. ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్.
పాన్ ఇండియా స్టార్' ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సందడి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 'ప్రాజెక్ట్ కె' అనే పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విదేశాల్లో కూడా విడుదలవుతున్న ఈ సినిమా ఓ టైమ్ ట్రావెల్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా కథ 2898 ఏడీలో జరగనుంది. నటుడు ప్రభాస్ ఇక్కడ కల్కి అవతారంలో ప్రపంచాన్ని రక్షించే వ్యక్తిగా కనిపిస్తాడు.
కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్‌కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేశారు. ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సినిమాలో నేను విలన్‌గా కనిపించబోతున్నాను. ప్రతినాయకుడు పాత్ర కాబట్టే దీన్ని అంగీకరించాను. అలానే ఓ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో ముఖ్యం. మా లాంటి యాక్టర్స్‌ని స్టార్స్ చేసేది వాళ్లే' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
అయితే 'కల్కి' సినిమాలో విలన్‌గా చేసేందుకు కమల్ హాసన్ ఒప్పుకోవడం చాలామందిని ఆశ‍్చర్యపరిచింది. 'విక్రమ్' లాంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై వచ్చిన కమల్.. 'కల్కి'లో నటించడం వెనక అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హస్తం ఉందని తెలుస్తోంది. 'కల్కి'కి మెంటార్‌గా ఉన్న ఆయనే.. కమల్‌తో మాట్లాడి ఒప్పించారని టాక్. సరే ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ మధ్య వచ‍్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అని అందరూ వెయిటింగ్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 21, 2023 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

