Kannada Actress Rita Anchan Dies: ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం

ప్రముఖ కన్నడ నటి రీటా రాధాకృష్ణ అంచన్(68) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కన్నడతో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ బాషల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో నటిగా ఓ వెలుగు వెలిగారు రీటా. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Kannada Actress Rita Anchan Dies: ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం
Kannada Actress Rita Anchan Dies At 68(X)

Hyd, Nov 16:  ప్రముఖ కన్నడ నటి రీటా రాధాకృష్ణ అంచన్(68) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కన్నడతో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ బాషల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో నటిగా ఓ వెలుగు వెలిగారు రీటా. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

కోరా బదన్, లడ్కీ జవాన్ హో గయీ, ఆప్ సే ప్యార్ హువా, సందర్భ మరియు ఫర్జ్ ఔర్ ప్యార్ వంటి అనేక ప్రముఖ చిత్రాలలో నటించారు రీటా. బిల్లవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు , టాటా కంపెనీలో సీనియర్ అధికారి టి.అంచన్ కుమార్తె రీటా అంచన్. రాధాకృష్ణ మంచిగయ్యతో వివాహం తర్వాత బెంగళూరులో నివాసం ఉంటున్నారు.  నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు 

సినిమాల తర్వాత సామాజిక సేవలో నిమగ్నమయ్యారు రీటా. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు రఘురామ్ ..రీటా మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె జీవిత కథను మీ అందరితో పంచుకోవాలనే నా కల నెరవేరలేదు అని తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 16, 2024 12:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).