Newdelhi, Nov 16: ప్రముఖ సినీ నటి దిశా పటానీ (Actress Disha Patani) తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్ లో (Commissions) మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. ఇందులో రూ.5 లక్షలు నగదు రూపంలో, మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు జగదీశ్ సింగ్ పేర్కొన్నారు. మూడు నెలలుగా తనకు పదవి ఇప్పించే అంశంపై ఎలాంటి పురోగతి కనిపించలేదని, దీంతో తాను ప్రశ్నించానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వారు తనకు చెప్పారని వెల్లడించారు. కానీ వారు ఎంతకూ తన డబ్బును తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.
Actor Disha Patani's Father Duped Of ₹ 25 Lakh; FIR Filed https://t.co/7NN2SWhthL#DishaPatani pic.twitter.com/J1Avia5PBm
— NDTV (@ndtv) November 16, 2024
ఏ పోస్టులు ఇప్పిస్తామన్నారంటే?
చివరకు తాను మోసపోయానని గుర్తించిన జగదీశ్ సింగ్ యూపీలోని బరేలి జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని నిందితులు తనకు చెప్పారని, ప్రభుత్వ కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవిని ఇప్పిస్తామని హమీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.