Fire Accident in UP (Credits: X)

Newdelhi, Nov 16: ఉత్తర ప్రదేశ్‌ లో (Uttarpradesh) ఘోరం జరిగింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం (Fire Accident in UP) సంభవించింది. ఈ ప్రమాదంలో రోజుల వయస్సున్న పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రి ఎన్ఐసీయూ విభాగంలో రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్‌ కాన్సన్‌ ట్రేటర్‌ లో విద్యుత్‌ షాట్​ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్‌ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్‌ సచిన్‌ మహోర్‌ తెలిపారు. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

Here's Video:

అప్పుడే క్లారిటీ

సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళం చర్యలు చేపట్టింది. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఈ ప్రమాదంపై  ఓ క్లారిటీ వస్తుందని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.