Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పుడు వైద్యం చూడకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్‌ మొబైల్‌ ఫోన్‌లో రీల్స్‌ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో ఆ మహిళ సరైన సమయానికి చికిత్స అందించకపోవడంతో ప్రాణాలు విడిచింది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి
Uttar Pradesh Doctor scrolls through reels as woman dies of heart attack in hospital

Lucknow, Jan 29:  ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పుడు వైద్యం చూడకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్‌ మొబైల్‌ ఫోన్‌లో రీల్స్‌ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో ఆ మహిళ సరైన సమయానికి చికిత్స అందించకపోవడంతో ప్రాణాలు విడిచింది. ఈ విషయం నిలదీసిన మహిళ కుమారుడి చెంపపై ఆ డాక్టర్‌ కొట్టడంతో ఆ మహిళ తరపు బంధువులు డాక్టర్‌పై దాడి చేశారు.ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

షాకింగ్ వీడియో..ఫోన్‌లో మాట్లాడుతూ రైలు వచ్చేది పట్టించుకోని యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

60 ఏళ్ల ప్రవేశ్ కుమారి మంగళవారం తీవ్ర ఛాతినొప్పితో బాధపడింది. కుమారుడు గురుశరణ్ సింగ్‌కు ఈ విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో మహారాజా తేజ్ సింగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మహిళను తీసుకువచ్చారు. ఆ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న డాక్టర్‌ ఆదర్శ్ సెంగర్ తన మొబైల్‌ ఫోన్‌లో సోషల్‌ మీడియా రీల్స్‌ చూడటంలో బిజీగా ఉన్నాడు. ఆ మహిళ పరిస్థితి గురించి ఆమె కుమారుడు, బంధువులు డాక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అతడు పట్టించుకోలేదు. ఆమెను చూడాలని నర్సులకు చెప్పాడు.

Uttar Pradesh Doctor scrolls through reels as woman dies of heart attack in hospital

మొబైల్‌ ఫోన్‌ చూడటంలో నిమగ్నమయ్యాడు.కొంత సేపటికి ఆ డాక్టర్‌ ఎదుటే విలవిలాడిన ఆ మహిళ గుండెపోటుతో మరణించింది.ఈ విషయం తెలిసి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).