Crime (Credits: X)

Hyderabad, Nov 16: హైదరాబాద్ (Hyderabad) లో ఘోర ఆగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌ మెంట్‌ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి. ఆకస్మిక మంటలను చూసి భయాందోళనలకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

Here's Video: 

కారణం అదేనా??

ఉదయం 3 గంటల సమయంలో మంచి నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అందరూ భయపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌ తో ప్రమాదం జరిగిందని అపార్ట్‌ మెంట్ వాసులు చెబుతున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా ఇదే భావనకు వచ్చారు.

వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..