Hyderabad, September 9: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండ స్పీడ్ కు బ్రేక్ వేయగా... దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పీడకలను మిగిల్చింది. ఈ సినిమా కోసం పూరీ తన మకాంను ముంబైకి మార్చేశారు. నెలకు రూ. 10 లక్షల అద్దెకు అక్కడ ఓ పెద్ద మ్యాన్షన్ ని అద్దెకి తీసుకున్నాడు. ఈ సినిమాను మూడేళ్ల పాటు నిర్మించారు. ప్రమోషన్స్ సమయంలో కూడా ఈ సినిమాకు పెద్ద హైప్ క్రియేట్ అయింది. కానీ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక చతికిల పడింది.
డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో ఆ భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతోనే 'జనగణ మన' తీయాలని పూరీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.