Nagendra Babu: ప్రకాష్ రాజ్‌తోనే ఎల్లప్పుడూ ఉంటా, బలగం, ధన ప్రభావంతో మా ఎన్నికలు నీచ స్థాయికి చేరాయి, రాజీనామా లేఖలో నాగబాబు, అతిథిగానే ఉంటానని తెలిపిన ప్రకాష్ రాజ్
ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను.
రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో (MAA Elections 2021) మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ఓడిపోవడం తెలిసిందే. ఇక మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్ రాజ్‌కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.
అన్నట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ (naga-babu-shares-his-maa-association-resignation-letter) చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association) తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు.
అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం.
Here's Naga Babu Konidela Tweet
Membership Resignation from MAA Association. pic.twitter.com/l4WlNaZlvx
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 11, 2021
అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్ రాజ్‌కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్‌పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.
ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు.. ‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావుగార్లు, రవిబాబు వంటివారు మాట్లాడారు.. అందుకే అతిథిగానే ఉంటా.
‘మా’ సభ్యుడు కాకున్నా నన్ను పిలిచి తన సినిమాలో చేయమని మంచు విష్ణు అడిగినా నటిస్తాను. తెలుగు ఇండస్ట్రీవారితో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుంది. ‘మా’ ఎన్నికల తర్వాత కొందరు ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అని మాట్లాడే అబద్ధాలను నేను నమ్మను’’ అన్నారు. అంతేకాకుండా సోమవారం రాత్రి ఓ ట్వీట్ చేశారాయన. ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’ అని ట్వీట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 12, 2021 01:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

