Sarkaru Vaari Paata Teaser: సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి, బర్త్ డే బ్లాస్టర్ పేరుతో సర్కారువారి పాట టీజర్ విడుదల, ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ
మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' నిర్మితమవుతోన్న సంగతి విదితమే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను (Sarkaru Vaari Paata Teaser) వదిలారు. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.
మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' నిర్మితమవుతోన్న సంగతి విదితమే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను (Sarkaru Vaari Paata Teaser) వదిలారు. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసిన ఫైట్ సీన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ టీజర్ ను వదిలారు. కీర్తి సురేశ్ తో రొమాన్స్ .. వెన్నెల కిశోర్ తో కలిసి కామెడీకి సంబంధించిన బిట్స్ ను చూపించారు. దాంతో పరశురామ్ మార్కు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగిస్తోంది.
ముఖ్యంగా మహేశ్ బాబు కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవాలి. సాధారణంగా లుక్ మార్చడానికి మహేశ్ బాబు పెద్దగా ఆసక్తిని చూపించడు .. అంగీకరించడు. హెయిర్ స్టైల్ విషయంలో మార్పుకు మాత్రమే ఆయన ఓకే చెబుతాడు. అలా కాస్త హెయిర్ స్టైల్ మార్చేసి, ఆయనను మరింత హ్యాండ్సమ్ గా చూపించడంలో పరశురామ్ సక్సెస్ అయ్యాడనే విషయం ఈ టీజర్ బట్టి అర్థమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇందులో 'మహానటి' కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా వచ్చిన బర్త్ డే బ్లాస్టర్ "ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ అదిరిపోయింది. 'ఇఫ్ యు మిస్ ద ఇంట్రెస్ట్ యూ విల్ గెట్ ద డేట్' అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో మహేష్ ఏ రేంజ్‌లో కనిపించబోతున్నాడో హింట్ ఇచ్చారు. భారీ యాక్షన్స్‌తో పాటు.. 'సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి'.. అని క్యూట్‌గా కీర్తి సురేశ్ చెప్పిన డైలాగ్‌తో మంచి కామెడి అండ్ రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
(The above story first appeared on LatestLY on Aug 09, 2021 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

