Manchu Family War: మంచు కుటుంబంలో వార్, కొడుకు వీడియోపై మోహన్ బాబు ఆగ్రహం, వెంటనే డిలీట్ చేసిన మంచు మనోజ్, వీడియో ఘటనపై స్పందించిన మంచు విష్షు, లక్ష్మీ
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి కారణం మంచు మనోజ్..విష్ణు వీడియోని షేర్ చేయడమే. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి కారణం మంచు మనోజ్..విష్ణు వీడియోని షేర్ చేయడమే. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. తన అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతడిపై విష్ణు దాడి చేశాడని, ఇలాగే బంధువుల ఇళ్లల్లో దాడులు చేస్తాడని మనోజ్ ఈ వీడియోలో ఆరోపించారు. ఈ వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ పేజీలో స్టేటస్ గా పెట్టారు. అయితే తన తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీడియోను డిలీట్ చేశారు.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని స్పష్టం చేశారు. మనోజ్ తన తమ్ముడని, తమిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు.
సారథి తనతో వాగ్వాదం పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని వివరించారు. మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్టు చేసి ఉంటాడని, దీన్ని పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.ఇక తన సోదరుల మధ్య జరిగిన గొడవపై మంచు లక్ష్మి స్పందించారు. మంచు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన విషయం గురించి తనకింకా తెలియదని, పూర్తి వివరాల్ని తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. విషయం గురించి పూర్తిగా తెలియకుండా వార్తల్ని స్ప్రెడ్ చేయడం సరికాదన్నారు.
బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు
ప్రస్తుతం తాను బంధువులతో బిజీగా ఉన్నానని, అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తున్నానని మంచు లక్ష్మి తెలిపారు. ఇంటి సభ్యులు, అన్నదమ్ముల మధ్య జరిగే గొడవగా పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు విన్నవించారు. మరోవైపు ఈ గొడవ గురించి మనోజ్ సన్నిహితులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడంలేదు.
(The above story first appeared on LatestLY on Mar 24, 2023 05:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

