Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Hyderabad May 15: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu). మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’కి సొంత బిల్డింగ్ కట్టిస్తాను అని ప్రకటించాడు. ఇదే స్లోగన్ తో ఎన్నికల్లో ముందుకెళ్లాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ”మరో ఆరునెలలలోపే ‘మా’ బిల్డింగ్ (MAA Building) కి భూమి పూజ చేస్తాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేస్తామన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని నటుడు, మంచు విష్ణు అన్నారు.
‘మా’ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగానే అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. మరో ఆరు నెలల్లో భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాం. ‘మా’ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే నా ప్రధాన కర్తవ్యం. అందుకోసం నా కమిటీతో కలిసి తగిన ప్రణాళికలు రచించాం. ఇక, సినిమా టికెట్ ధరల విషయంలో నేను మాట్లాడలేదని అందరూ విమర్శించారు. కావాలనే నేను సైలెంట్‌గా ఉన్నా. టికెట్ ధరలు పెంచితే కొందరికి.. తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులున్నాయని చెప్పారు. టికెట్ రేట్లు అనేది చాలా పెద్ద విషయం. దీని గురించి, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అని మంచు విష్ణు అన్నారు.
(The above story first appeared on LatestLY on May 15, 2022 02:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

