BRO First Song: మీ స్పీకర్లు పేలడం ఖాయం! బ్రో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన తమన్, మ్యూజిక్ బ్లాస్ట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌

మొదటి పాట ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో స్టైలిష్‌గా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మీ స్పీకర్లు పేలడం గ్యారంటీ.. అంటూ సాగే ఈ పాటను జులై 8న సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశాడు థమన్‌.

BRO First Song: మీ స్పీకర్లు పేలడం ఖాయం! బ్రో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన తమన్, మ్యూజిక్ బ్లాస్ట్ కోసం ఫ్యాన్స్   వెయిటింగ్‌
BRO First Song (PIC@ Twitter)

Hyderabad, July 07: టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాజెక్టుల్లో ఒకటి బ్రో (Bro The Avatar). పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బ్రో ఫస్ట్‌ సింగిల్‌ మై డియర్ మార్కండేయ లోడింగ్ అంటూ థమన్ (S Thaman)‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏం టైంలో అనేది సస్పెన్స్ లో పెట్టేశాడు. తాజాగా ఆ సస్పెన్స్‌కు

తెరదించుతూ క్లారిటీ ఇచ్చేశాడు. జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఎస్ థమన్ టీం మ్యూజికల్ బ్లాస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మొదటి పాట ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో స్టైలిష్‌గా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది.

మీ స్పీకర్లు పేలడం గ్యారంటీ.. అంటూ సాగే ఈ పాటను జులై 8న సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశాడు థమన్‌. సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన బ్రో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

సాయి ధరమ్‌ తేజ్‌, టైమ్‌ లైన్‌, పవన్‌ కల్యాణ్‌ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పాడు సముద్రఖని. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వివేక్‌ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సంభాషణలు అందిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 07, 2023 09:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).