#PSPK28 Update: పవన్ కళ్యాణ్ సినిమా PSPK28 ఫస్ట్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన మైత్రీమూవీ మేకర్స్‌, సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా వెల్లడిస్తామంటూ ట్వీట్

PSPK28 పోస్టర్ పస్ట్ లుక్ (PSPK28 First look update) ఇదేనంటూ పలు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పందించింది. ఈ సినిమాపై ఒక ప్రకటన విడుదల చేసింది.

#PSPK28 Update: పవన్ కళ్యాణ్ సినిమా PSPK28 ఫస్ట్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన మైత్రీమూవీ మేకర్స్‌, సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా వెల్లడిస్తామంటూ ట్వీట్
PSPK28 Update (Photo-Twitter)

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమాని తయారు చేసిన ఫొటోతో పాటు, పలు వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. PSPK28 పోస్టర్ పస్ట్ లుక్ (PSPK28 First look update) ఇదేనంటూ పలు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పందించింది. ఈ సినిమాపై ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్విట్టర్ వేదికగా..‘‘పవన్‌కల్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన ఈ ఏడాది ఉగాది రోజున ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్ చేసింది.

పవన్ తాజా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఇప్పటికే ‘అప్పయనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌, ‘హరి హర వీరమల్లు’ చిత్రాల షూటింగ్‌ మొదలైంది. కరోనా కారణంగా వాటి చిత్రీకరణ వాయిదా పడింది. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే పవన్‌ రంగంలోకి దిగనున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 09, 2021 02:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).