Credit@Vignes shivan Twitter

Chennai, OCT 09: విగ్నేష్ శివన్, నయనతార (Nayanthara and Vignesh Shivan) జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది. వాళ్ళు అమ్మ నాన్నలు అయ్యారు. పండంటి ఇద్దరు మగ కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చారు. 2022 జూన్ 9న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నయనతార (Nayanatara) మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత నెల రోజులకు పైగానే ఇద్దరు దుబాయ్ వెళ్లి హనీమూన్ (Honeymoon) చేసుకున్నారు. పెళ్లయి 5 నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఇద్దరు కవల పిల్లలు ఎలా అనే అనుమానం రావచ్చు. పైగా నయనతార ప్రెగ్నెన్సీ కూడా కాలేదు కదా అనుకుంటున్నారా..? సరోగసి పద్ధతిలో (Surogcy) విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విగ్నేష్.

తను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. తమ లైఫ్ లో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్.

Kushboo in Hospital: హాస్పిటల్ బెడ్‌ మీద కుష్భూ, ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా? ఆస్పత్రి బెడ్‌ మీద నుంచే సెల్ఫీ పోస్ట్ చేసిన అలనాటి హీరోయిన్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్స్ 

త్వరలోనే ఈయన అజిత్ హీరోగా ఓ సినిమా చేయబోతుడు. మరోవైపు నాయనతర ఈ మధ్య గాడ్ ఫాదర్ (Godfather) సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తుంది. హిందీలో షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి అమ్మా నాన్నలుగా ప్రమోషన్ పొందిన ఈ కొత్త జంటను సోషల్ మీడియాలో అభిమానులు అభినందనల వెల్లువతో ముంచేస్తున్నారు.