Jr.NTR in New Member Class Of Actors: మరో అరుదైన ఘనత సాధించిన యంగ్ టైగర్, ఆస్కార్ కమిటీలో జూనియర్ ఎన్డీఆర్, సంబురాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
ఆస్కార్ (Oscar) తన కొత్త మెంబెర్స్ లిస్ట్ ని నేడు ప్రకటించింది. ఇక ఈ లిస్ట్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అకాడమీ (Academy Oscar) కమిటీ తెలియజేస్తూ ఒక పోస్టు చేసింది. యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ కి (Jr. NTR) అకాడమీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
Hyderabad, OCT 19: యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు, గౌరవాలు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న ఈ హీరో తాజాగా మరో గౌరవాన్ని అందుకున్నాడు. ఆస్కార్ (Oscar) తన కొత్త మెంబెర్స్ లిస్ట్ ని నేడు ప్రకటించింది. ఇక ఈ లిస్ట్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అకాడమీ (Academy Oscar) కమిటీ తెలియజేస్తూ ఒక పోస్టు చేసింది. యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ కి (Jr. NTR) అకాడమీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నిన్ను చూస్తుంటే చాలా గౌరవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
కాగా గతంలో అకాడమీ తన కొత్త సభ్యుల జాబితాని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళు అయితే మిగిలిన ఇద్దరు.. కరణ్ జోహార్, షౌనక్ సేన్.
69th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కృతి సనన్, మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు
RRR సినిమా టీం నుంచి ఎన్టీఆర్, చరణ్, DOP సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఉన్నారు. అప్పుడు సభ్యులుగా అనౌన్స్ చేసిన వారిని.. ఇప్పుడు క్లాస్‌లు వారిగా విభజించి అనౌన్స్ చేస్తుంది. ఈక్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ క్లాస్ లో కీరవాణిని, సినిమాటోగ్రాఫర్ క్లాస్ లో సెంథిల్ కుమార్ ని ఇప్పటికే అనౌన్స్ చేసింది. తాజాగా ఎన్టీఆర్ ని యాక్టర్స్ క్లాస్ లో మెంబెర్ గా అనౌన్స్ చేసింది.
(The above story first appeared on LatestLY on Oct 19, 2023 11:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

