Ntr Hosts Special Dinner Party: జూనియర్‌ ఇంట్లో డిన్నర్‌ పార్టీ, వైరల్‌గా మారిన ఫోటోలు, హాజరైన అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా ఎవరెవరు వచ్చారంటే?

ఎన్టీఆర్‌ బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్‌ పార్టీ అరేంజ్‌ చేశాడు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు అమెజాన్‌ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను.

Ntr Hosts Special Dinner Party: జూనియర్‌ ఇంట్లో డిన్నర్‌ పార్టీ, వైరల్‌గా మారిన ఫోటోలు, హాజరైన అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
Ntr Hosts Special Dinner Party (PIC @ NTR Twitter)

Hyderabad, April 13: నందమూరి లెగసినీ కంటిన్యూ చేస్తున్న నటులలో తారక్‌ (Jr.NTR) ఒకడు. తాతకు తగ్గ మనవడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో భీమ్‌ పాత్రలో తారక్‌ నటన వర్ణానాతీతం. ఇక ప్రస్తుతం తారక్‌ అదే జోష్‌తో కొరటాల శివతో (NTR30) సినిమా చేస్తున్నాడు. సెమి పీరియాడిక్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైంది. ఓ భారీ షెడ్యూల్‌ కూడా పూర్తయింది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్‌ పార్టీ (NTR Party) అరేంజ్‌ చేశాడు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు అమెజాన్‌ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ (James Farrel) హాజరయ్యాడు.

ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను. ముఖ్యంగా జేమ్స్, ఎమిలీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మంచి మాటలకు, పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పార్టీకి రాజమౌళి (SS Rajamouli), కొరటాల శివతో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్‌, నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌లు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Apr 13, 2023 09:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).