Deepika Padukone and Ranveer Singh: ముంబై సిద్దివినాయక ఆలయంలో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సందడి, విఘ్నేషుడి ఆశీస్సులు తీసుకున్న కాబోయే తల్లిదండ్రులు
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika padukone) మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) కలిసి శుక్రవారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించింది.
Mumbai, SEP 06: అనంతరం దీపికా, రణ్‌వీర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌తో పాటు దీపికాను ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Here's Video
View this post on Instagram
2018లో దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు.
సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.
(The above story first appeared on LatestLY on Sep 06, 2024 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

