Actor Yash Pic Gone Viral: భార్య కోసం అర్ధరాత్రి పూట కేజీఎఫ్ స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు
. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.
Bangalore, FEB 17: కర్నాటకలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న కిరాణా షాపుకి రాకింగ్ స్టార్ యష్ వెళ్లారు. తన భార్యకు ఐస్-క్యాండీ కొంటూ కనిపించారు (Yash Buying Ice Candy). తన స్టార్ డమ్ పక్కన పెట్టి సింపుల్‌గా ఉండే యష్ నేచర్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇటీవల యష్ తన భార్య రాధిక పండిట్, పిల్లలు ఐరా,యథర్వ్‌లతో కలిసి కర్నాటక షిరాలీలోని చిత్రపూర్ మఠానికి వెళ్లారు. ఆ సందర్భంలో రాత్రివేళ షిరాలీ గ్రామంలోని ఓ కిరాణా షాపు బయట యష్ కనిపించారు. తన భార్య కోసం ఐస్ క్యాండీ (Yash Buying Ice Candy) కొన్నారు. ఆ ఫోటోలో భార్య రాధిక కూడా ఉన్నారు. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.
Rocking Star Yash purchases ice candy for his wife Radhika from a small grocery shop.
Despite huge stardom, #Yash remains simple and humble
This is during their recent… pic.twitter.com/YTRW6av6xJ
— Manobala Vijayabalan (@ManobalaV) February 17, 2024
నిజంగానే యష్ సింప్లిసీటీని అభిమానించే వాళ్లు అనేకమంది ఉన్నారు. కన్నడనాట యష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. KGF2 సినిమా తర్వాత యష్ ‘టాక్సిక్’ అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Feb 17, 2024 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

