Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు
Allu Arjun (Credits: FB)

Hyderabad, Nov 30: టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ (Hyderabad) లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తనకు అభిమానులు కాదు... ఆర్మీ ఉందంటూ ప్రతి ఈవెంట్ లో అల్లు అర్జున్ చెపుతుండటం అందరికీ తెలిసిందే. 'పుష్ప 2' ఈవెంట్లలో కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. దీనిపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిన్న అల్లు అర్జున్, ఇవాళ ర‌ష్మిక మంద‌నా, సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏమని ఫిర్యాదు చేశారంటే?

తన అభిమాన సంఘానికి 'అర్జున్ ఆర్మీ' అని బన్నీ పేరు పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆర్మీ అనేది దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు అని... ఈ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఇదేదీ పట్టించుకోకుండా అల్లు అర్జున్ తనకు ఆర్మీ ఉందని చెపుతున్నారని... వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)

(The above story first appeared on LatestLY on Nov 30, 2024 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).