Radhe Shyam: రాధే శ్యామ్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ప్రభాస్, ప్రేమ కథల్లో అభిమానులు నన్ను చూడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చని తెలిపిన రెబల్ స్టార్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) స్పందించాడు. ఇక ఇదే విషయంపై ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను.
సినీ ప్రపంచంలో బాహుబలి' సిరీస్‌తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఆ చిత్రాలు ఇచ్చిన విజయంతో అదే స్పీడ్లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తాజాగా విడుదలైన తన చిత్రం 'రాధే శ్యామ్' (Radhe Shyam) బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఫలితంపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) స్పందించాడు. ఇక ఇదే విషయంపై ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను. సినిమా రీషూట్ చేస్తే తప్పు ఏముంది, అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు కొరటాల, ఆచార్య మూవీని రీషూట్ చేయలేదని వెల్లడి
అలాగే పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న బడ్జెట్ చిత్రాలైనా నాకిష్టమే. ఇక 'రాధే శ్యామ్' విషయానికి వస్తే ఆ చిత్రం రిలీజ్ సమయానికి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నా. దాంతో పాటు నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దాదాపు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Apr 20, 2022 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

