Prabhas Hurted In Shooting: ప్రభాస్ ను చితకబాదిన నటుడు, షూటింగులో అతడు కర్రతో కొడితే, ప్రభాస్ వీపు నిజంగానే వాచిపోయిందట, ఇంతకీ ఎవరు అతడు..
ఛత్రపతి సినిమాలో లైన్ దాటి కాట్రాజు తో జరిగే ఫైటింగ్ ఇప్పటికీ బెస్ట్ యాక్షన్ సీన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ ను కాట్రాజ్ ఓ కర్ర తో వీపుపై బలంగా కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ కర్రను రవీందర్ రెడ్డి సముద్రంలోని ఉప్పుతో తయారు చేశారట. ఆ కర్రతో కాట్రాజ్ కొడితే తన వీపు పగిలిపోయింది అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా కూడా మంచి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ కెరీర్ తొలినాళ్లలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాడు. క్రేజీ హీరో అయినా కూడా స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆయన కంటే ముందు వచ్చిన హీరోలు మాస్ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. కానీ ప్రభాస్ కు మాత్రం ఆ కల అప్పటికి నెరవేరలేదు. ఈ సమయంలోనే రాజమౌళి వచ్చే ప్రభాస్ మార్కెట్ ను అమాంతం పెంచేశాడు.
ప్రభాస్ కోరుకున్న మాస్ ఆడియన్స్ ను కూడా తెచ్చి పెట్టాడు. ఆ మూవీనే ఛత్రపతి. ప్రస్తుతం రాదే శ్యామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గురించి అద్భుతంగా వివరించారు.
ఛత్రపతి సినిమాలో లైన్ దాటి కాట్రాజు తో జరిగే ఫైటింగ్ ఇప్పటికీ బెస్ట్ యాక్షన్ సీన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ ను కాట్రాజ్ ఓ కర్ర తో వీపుపై బలంగా కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ కర్రను రవీందర్ రెడ్డి సముద్రంలోని ఉప్పు నానాబెట్టి మరీ తయారు చేశారట. పైగా అచ్చం పాతకాలం నాటి కర్రలాగా ఉండేందుకు దానిపై నాచు లాంటివి వేసి నేచురల్ ఫీలింగ్ వచ్చేలా చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కర్రతో కాట్రాజ్ కొడితే తన వీపు పగిలిపోయింది అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అంటే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పనితనం అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పాడన్నమాట.
ప్రస్తుతం రాధేశ్యాం కోసం కూడా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పనిచేశారట. ఆయన వేసిన సెట్లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రభాస్ మెచ్చుకున్నారు. ఇలా రవీందర్ రెడ్డి గురించి ప్రభాస్ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నాడు.ఇక ప్రభాస్ మార్చి 11 వ తేదీన రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Mar 08, 2022 11:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

