Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.

Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?
Allu Arjun (photo-Video Grab)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.

ఖచ్చితమైన షాట్ కోసం 51 టేక్‌లు ఇచ్చాడు. ఈ చిత్రానికి పని చేస్తున్న సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి కూడా అల్లు అర్జున్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని మేకర్స్ తెలిపారు. అల్లు అర్జున్ డెడికేషన్ లెవల్స్‌ని రెసూల్ మెచ్చుకున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప: ది రూల్ సునీల్, అనసూయ, రష్మిక, ఫహద్ తదితరులు నటిస్తున్నారు. పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)

సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకొని అదరగొట్టారు. బన్నీ గెటప్‌కు అందరూ షాక్ అయ్యారు. అల్లు అర్జున్ కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా, ఇది వాళ్ల అమ్మదంట. సెంటిమెంట్ గా ఉంటుంది అంటూ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ హైలెట్ గా ఉండబోతుంది అంటున్నారు జనాలు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ ఫైట్ సీన్ ఇంటర్వెల్లో రాబోతున్నట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on Apr 09, 2024 05:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).