Radhe Shyam Song Aashiqui Aa Gayi Out: రాధేశ్యామ్‌ నుంచి క్రేజీ అప్‌డేట్, ఆషికీ ఆగయా సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, మెస్మరైజ్ చేసిన ప్రభాస్ లుక్స్, అర్జీత్ వాయిస్

ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్‌(Radhe Shyam) మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవికి సంబంధించిన ఆషికీ ఆగయా(Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేశారు.

Radhe Shyam Song Aashiqui Aa Gayi Out: రాధేశ్యామ్‌ నుంచి క్రేజీ అప్‌డేట్, ఆషికీ ఆగయా సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, మెస్మరైజ్ చేసిన ప్రభాస్ లుక్స్, అర్జీత్ వాయిస్

Mumbai December 01: ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్‌(Radhe Shyam) మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవికి సంబంధించిన ఆషికీ ఆగయా(Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేశారు.

జనవరి  14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోష‌న్స్ సాగుతున్నాయి. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ ఉన్న డ్రెస్‌లో ప్రభాస్‌(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) మ‌ధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. ఈ పాట‌లో విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ప్రభాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేమికుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదనిపిస్తుంది.

ఆషికీ-2(Aashiqui-2) మూవీకి మ్యూజిక్ చేసిన టీమ్‌ ఈ సాంగ్‌ను కంపోజ్ చేసింది. తుమ్‌ హీ హో సాంగ్‌తో పాపులర్ అయిన అర్జీత్ సింగ్(Arjith Singh) ఆషికీ ఆగయా సాంగ్ పాడారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్లుగానే ఈ సాంగ్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇందులో ఎదుటివారి చేతి రేఖ‌ల‌ను చూసి వారి భ‌విష్యత్తును చెప్పగ‌ల నేర్పరి అయిన హీరో.. త‌న ప్రేయ‌సి చేతి రేఖ‌ల‌ను చూసి ఆమె ప్రమాదాల‌ను ప‌సిగ‌డ‌తాడు. ఆమెను ఆ ప్రమాదాల బారి నుంచి ఎలా ర‌క్షించుకున్నాడ‌నేదే సినిమా అని తెలుస్తుంది.

Radhe Shyam New Poster: రాధే శ్యామ్ కొత్త పోస్టర్ విడుదల, సింపుల్ లుక్‌లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రభాస్, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

యువీ క్రియేష‌న్స్‌(UV Creations), టీ సిరీస్(T series) సంస్థల‌పై మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్రమోద‌, ప్రశీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్(Radha Krishna) సినిమాను డైరెక్ట్ చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 01, 2021 12:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).