Rajinikanth Onam Celebrations: ర‌జినీకాంత్ ఓన‌మ్ డ్యాన్స్ చూశారా? కూలీ సెట్స్ లో పంచెక‌ట్టుతో సంద‌డి చేసిన సూప‌ర్ స్టార్

సినిమా సెట్స్‌లో ర‌జనీకాంత్ (Rajinikanth) పంచెక‌ట్టులో ఓనం వేడుక‌లు జ‌రుపుకున్నాడు. అంతేగాకుండా త‌న రీసెంట్ సూప‌ర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

Rajinikanth Onam Celebrations: ర‌జినీకాంత్ ఓన‌మ్ డ్యాన్స్ చూశారా? కూలీ సెట్స్ లో పంచెక‌ట్టుతో సంద‌డి చేసిన సూప‌ర్ స్టార్
Rajinikanth Onam Celebrations (PIC @ X)

Hyderabad SEP 15: కేరళ ప్ర‌జ‌లు నేడు ఓనం పండుగ‌ను జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. మలయాళీ క్యాలెండర్‌లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓన‌మ్ పండుగా వ‌స్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓన‌మ్‌. ఈ పది రోజుల పండుగ 2024లో సెప్టెంబ‌ర్ 06న శుక్ర‌వారం మొదలై.. ఆదివారంతో ముగియనుంది. ఇక ఓన‌మ్ పండుగ (Onam) సంద‌ర్భంగా.. కేరళలో ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది.

‘Thalapathy 69’: ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే విజ‌య్ 69, ఇంత‌కీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?  

అయితే సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తాజాగా ఓనం పండుగ‌ను జ‌రుపుకున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం కూలీ (Coolie Sets). లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతుంది.

Here's Rajinikanth Dance Video

 

ఈ  సినిమా సెట్స్‌లో ర‌జనీకాంత్ (Rajinikanth) పంచెక‌ట్టులో ఓనం వేడుక‌లు జ‌రుపుకున్నాడు. అంతేగాకుండా త‌న రీసెంట్ సూప‌ర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

(The above story first appeared on LatestLY on Sep 15, 2024 07:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).