Ram Charan Buy Adipurush Tickets: అనాథలకు ఉచితంగా ఆదిపురుష్‌ మూవీ చూపించనున్న రామ్‌చరణ్, 10వేల టికెట్లు బుక్‌ చేసినట్లు వార్తలు!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram charan) సైతం 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అలాగే అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Ram Charan Buy Adipurush Tickets: అనాథలకు ఉచితంగా ఆదిపురుష్‌ మూవీ చూపించనున్న రామ్‌చరణ్, 10వేల టికెట్లు బుక్‌ చేసినట్లు వార్తలు!
Ram Charan Buy Adipurush Tickets (PIC@FB and insta)

Hyderabad, June 10: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్‌ (Adipurush) ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని డార్లింగ్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ (Om Raut) రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ (Prabhas) కనిపించనున్నాడు. సీతగా బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌, లంకేశుడిగా నటించారు. ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుండగా.. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తమవంతుగా ఒక్కొక్కరు 10వేల చొప్పున సినిమా టికెట్లు కొనుగోలు చేసి నిరుపేదలు, అనాథలకు ఆదిపురుష్‌ సినిమా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..  

అయితే, టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram chaan) సైతం 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అలాగే అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అఫీషియల్‌ సమాచారం తెలియాల్సి ఉంది.

Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్ 

ఇదిలా ఉండగా.. ఆది పురుష్‌ను పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 6200కి పైగా స్క్రీన్లలో విడుదల చేయనుండగా.. తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు లక్ష్యం మేకర్స్‌ పెట్టుకున్నారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌ను మూవీ తెరకెక్కగా దాదాపు రూ.1000కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సమయంలో వీఎఫ్‌ఎక్స్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పలు సన్నివేశాలను తప్పుగా చిత్రీకరించారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఈ టాక్‌ సినిమాపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి..!

(The above story first appeared on LatestLY on Jun 10, 2023 09:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).