RRR Update: ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్, సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్, ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. త్రిపుల్‌ ఆర్ మూవీకి సంబంధించిన రెండో సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌న రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 10న సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

RRR Update: ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్, సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్, ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Hyderabad November 05: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. త్రిపుల్‌ ఆర్ మూవీకి సంబంధించిన రెండో సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌న రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 10న సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

త్రిపుల్‌ ఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. దీంతో ప్రమోషన్‌ను వేగవంతం చేశారు రాజమౌళి. ఇప్పటికే దోస్తీ సాంగ్‌ను విడుదల చేశారు. త్రిపుల్ ఆర్ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా చిత్రం నుండి రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

బాహుబ‌లి సినిమాతో త‌న సినిమాల‌పై రెట్టింపు అంచ‌నాలు పెంచారు జ‌క్కన్న‌. తాజాగా ఆయ‌న మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం ) అనే సినిమా తెర‌కెక్కించారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్.

త్రిపుల్ ఆర్ టీమ్‌ రిలీజ్ చేసిన  ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఇద్దరు చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 05, 2021 10:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).