Sai Dharam Tej Vs Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్​, స్నేహారెడ్డిని సోష‌ల్ మీడియాలో అన్​ఫాలో చేశాడు. ఇంత‌కుముందు అర్జున్​, స్నేహాని ఫాలో అవుతున్న సాయి తేజ్ తాజాగా అన్ ఫాలో చేసిన‌ట్లు తెలుస్తుంది. కాగా ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

Sai Dharam Tej Vs Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్
Sai Dharam Tej Vs Allu Arjun (PIC@ Insta)

Hyderabad, June 12: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ప్రమాణస్వీకారం చేశారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ దురంగా ఉన్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొన్న చిరంజీవి ఇంటికి వెళ్లిన‌ప్పుడు అయిన.. నేడు ప్రమాణ స్వీకార వేడుక‌లో అయిన అల్లువారి కుటుంబం క‌నిపించ‌లేదు. దీంతో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గొడ‌వ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం 

అయితే ఈ నేప‌థ్యంలోనే ఒక షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్​, స్నేహారెడ్డిని సోష‌ల్ మీడియాలో అన్​ఫాలో చేశాడు. ఇంత‌కుముందు అర్జున్​, స్నేహాని ఫాలో అవుతున్న సాయి తేజ్ తాజాగా అన్ ఫాలో చేసిన‌ట్లు తెలుస్తుంది. కాగా ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో అల్లు అర్జున్ ప‌వ‌న్ కల్యాణ్‌కు మ‌ద్ద‌తునిస్తునే నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం మాత్రం ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేశారు. దీంతో ఈ విష‌యంపై నాగ‌బాబు స్పందిస్తూ.. పరాయివాడు అంటూ ట్వీట్​ చేసి డిలీట్​​ చేశాడు. దీంతో అప్ప‌టినుంచి ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 07:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).