Salman Khan Gets Fresh Threat: ‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి’.. సల్మాన్‌ ఖాన్‌ కు తాజాగా బెదిరింపులు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తో ఉన్న శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా తమకు వెంటనే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు హెచ్చరికలు జారీ చేశారు.

Salman Khan Gets Fresh Threat: ‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి’.. సల్మాన్‌ ఖాన్‌ కు తాజాగా బెదిరింపులు
Salman Khan (Photo Credits: Instagram)

Newdelhi, Oct 18: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తో ఉన్న శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా తమకు వెంటనే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్‌ పోలీసుల (Police) వాట్సప్‌ నంబర్‌ కు గురువారం రాత్రి మెసేజ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. మెసేజ్ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. 1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్‌ ఖాన్‌.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌ జాబితాలో టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు.

వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు

ఆ మెసేజ్‌ లో ఏముందంటే..

‘మా బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తో శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా ఆయన రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని దుండగులు మెసేజ్ లో హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా

(The above story first appeared on LatestLY on Oct 18, 2024 10:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).