Jaanu Teaser: నిన్నెక్కడ వదిలేశానో అక్కడే ఉన్నా! తమిళ సినిమా 96 తెలుగు రీమేక్ 'జాను' టీజర్ విడుదల, స్నేహం- ప్రేమల సున్నితమైన భావోద్వేగాల కథ త్వరలో తెలుగులో
Jaanu teaser | (Photo Credits: Dil Raju)

చిన్నప్పుడు స్కూల్లో ఒకే తరగతి గదిలో చదువుతున్నప్పుడు ఇద్దరి మధ్య చూపులతో మొదలైన వారి ప్రేమ ఎలా సాగుతుంది. కాలేజీ సమయానికి వేరుపడిన ఆ జంట, మళ్ళీ ఎన్నో ఏళ్లకు ఒక 'గెట్-టుగెదర్' వేడుకలో కలుస్తున్నప్పుడు కలిగే భావోద్వేగం, ఆ వేడుకలో ఇద్దరు చూసుకున్న మొదటి క్షణం, దగ్గరికి వస్తున్నప్పుడు పెరిగే గుండె వేగం ఇలా అన్నీ భావోద్వేగాలను తట్టే ఒక కథనం, ఒక జంట మధ్య స్నేహం - ప్రేమల యొక్క సున్నిత భావాలను చూపే ఓ కథ - '96'. తమిళంలో విజయ్ సేతుపతి- త్రిష జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ అవుతోంది.

తెలుగులో శర్వానంద్ (Sharwanand)- సమంత (Samantha ) కలిసి నటిస్తున్న 'జాను' చిత్రాన్ని 96కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది.

Here's the Jaanu Teaser:

టీజర్ చూస్తే, కథ- కథనంను ఎలాంటి కల్తీ చేయకుండా మరోసారి ఆ అందమైన కావ్యాన్ని అంతే తాజాగా ఆవిష్కరిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రతీ ఒక్కరికి తమ స్కూల్ లైఫ్ జ్ఞాపకాలు, అప్పటి స్నేహాలు, స్నేహితులు మరొకసారి గుర్తుకువస్తాయి. ఎంతో పరిపక్వమైన నటనను, అభినయాన్ని ప్రదర్శించే శర్వానంద్ మరియు సమంత ఈ చిత్రంతో మరోసారి తమ ప్రతిభను కనబరిచారు.

ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి '96' తెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.