Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే?

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్ద‌రిని క‌దిపినా అదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున స్పందించారు. తాజాగా స‌మంత (Samantha) కూడా ఈ కామెంట్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అభ్యంత‌రం తెలిపారు

Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే?
Samantha Reacts on Surekha Comments

Hyderabad, OCT 02: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్ద‌రిని క‌దిపినా అదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున స్పందించారు. తాజాగా స‌మంత (Samantha) కూడా ఈ కామెంట్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అభ్యంత‌రం తెలిపారు. ఇన్ స్టా వేదిక‌గా స‌మంత చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే పలు మార్లు ఆమె విడాకుల (Naga Chaitanya- Samantha Divorce) అంశంపై స్పందించారు. స‌రిగ్గా మూడేళ్ల క్రితం నాగ చైత‌న్య‌, స‌మంత ఇదే రోజున విడాకులు ప్ర‌క‌టించారు. అయితే మ‌ళ్లీ మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌తో ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో స‌మంత స్పందిస్తూ..

Here's the Samantha Reaction

 

మ‌హిళ‌ల్ని వ‌స్తువుల్లా చూసే ఈ గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేయ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం, నిల‌బ‌డి పోరాడ‌టానికి చాలా శ‌క్తి కావాలి, నా ప్ర‌యాణాన్ని చిన్న‌చూపు చూడొద్దు, ఇక విడాకుల‌నేవి పూర్తిగా నా వ్య‌క్తిగ‌త విష‌యం. అది ఇద్ద‌రి అంగీకారంతో ఎటువంటి రాజ‌కీయ కుట్ర లేకుండా జ‌రిగింది. ద‌య‌చేసి నా పేరును రాజ‌కీయాల‌కు దూరం పెట్టండి అంటూ ఆమె ఒక నోట్ విడుద‌ల చేశారు.

(The above story first appeared on LatestLY on Oct 02, 2024 08:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).