Naga Chaitanya-Samantha Divorce

Hyderabad, July 22: సమంత రూతు ప్రభు (Samantha Ruth Prabhu) ఎట్టకేలకు మాజీ భర్త నాగచైతన్య నుండి విడిపోవటానికి కారణాలను బయటపెట్టారు. కాఫీ విత్ కరణ్ షోలో(Koffee With Karan ) పాల్గొన్న సమంత (samantha).. నాగచైతన్యతో (naga chaithnya) విడాకుల గురించి మాట్లాడింది. అయితే మా మధ్య విడిపోవటం సామరస్యంగా జరగలేదని తెలిపింది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత జీవితం (Divorce) చాలా కష్టం అనిపించిందని అంగీకరించింది. అయితే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని, నా పని నేను చేసుకుంటూ పోతున్నానని తెలిపింది. విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరు తీవ్ర మనోవేదనకు గురయ్యామని తెలిపింది.

Koffee With Karan: సమంతతో అక్షయ్ కుమార్ డ్యాన్స్ వీడియో వైరల్, కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్ లో సందడి 

విడాకుల విషయంలో మీరు, మీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. కారణం మీరే అని నేను అనుకుంటున్నాను అని కరణ్ (Karan) ప్రశ్నించే క్రమంలో కల్పించుకున్న సమంత ‘మాజీ భర్త’ అనాలి అంటూ తెలిపింది. కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని మీరు భావించారా అని ప్రశ్నించారు.. సమంత బదులిస్తూ.. “అవును, నేను దాని గురించి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు అంటూ పేర్కొంది.

Ram Gopal Varma: ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు 

నాగచైతన్య నుంచి విడిపోయేటప్పుడు భరణం తీసుకుందని వచ్చిన వార్తపై కూడా సమంత స్పందించింది. తనకు భరణంగా ₹250 కోట్లు వచ్చిందనే పుకార్లు వచ్చాయని, రూ.250 కోట్లు తీసుకుందని అనడం ఎంత పెద్ద అబద్ధమో మీడియా గ్రహించినప్పుడు పుకార్లు వాటంతట అవే ఆగిపోయాయని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సమంత, చైతన్య తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య, సమంత దాదాపు నాలుగేళ్ల వివాహబంధాన్ని ముగించుకున్న సందర్భంగా అక్టోబర్ 2న ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు వారు ఏ వేదికపైన ఈ విషయం మాట్లాడలేదు. తాజాగా సమంత వారిద్దరి విడాకుల అంశంపై స్పందించింది. మీ ఇద్దరినీ ఒకే రూంలో ఉంచితే ఏం జరుగుతుందని కరణ్ ప్రశ్నించగా...ఆ రూంలో పదునైన వస్తువులను దాచి పెట్టాలని సమంత చెప్పింది.