Prabhakar Reacts on Trolls: కొడుకు ట్రోలింగ్‌పై ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు, రేపు హీరో అయితే వాళ్లే ఆదరిస్తారు, జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారని తెలిపిన బుల్లితెర నటుడు
ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు.
తన కొడుకు చంద్రహాస్ పై వస్తున్న ట్రోల్స్‌పై టీవీ నటుడు ప్రభాకర్ (Prabhakar Reacts on Trolls) తాజాగా స్పందించారు. ఓ తెలుగు మీడియా రిపోర్టర్ మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్ వచ్చాయా? అని హోస్ట్ అడగ్గా ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు.
పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి.యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు.
చంద్రహాస్ నిలబడ్డ స్టైల్ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించాడు.కాగా చంద్రహాస్ చూపించిన యాటీట్యూడ్, ఆయన నిలుచున్న తీరుతో అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.
(The above story first appeared on LatestLY on Sep 22, 2022 10:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

