Sonu Helps Meher Ramesh: సోనూ సూద్ సాయం కోరిన దర్శకుడు మెహర్‌ రమేశ్, 24 గంటల్లోనే సాయం చేసిన సోనూ సూద్, ట్విట్టర్ వేదికగా చేతులెత్తి నమస్కరించిన తెలుగు చిత్ర దర్శకుడు

తెలుగు దర్శకుడు మెహర్‌ రమేశ్ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ చేసిన సాయానికి (Sonu Helps Meher Ramesh) చేతులెత్తి మొక్కాడు. దర్శకుడు మెహర్‌ రమేశ్ (Meher Ramesh) వెంకట రమణ అనే రోగి కోసం (P Venkata Ramana) కొన్ని ఇంజక్షన్లు, మెడిసిన్లు కావాలని కోరుతూ సోనూ సూద్ కి ట్వీట్‌ చేశాడు.

Sonu Helps Meher Ramesh: సోనూ సూద్ సాయం కోరిన దర్శకుడు మెహర్‌ రమేశ్, 24 గంటల్లోనే సాయం చేసిన సోనూ సూద్, ట్విట్టర్ వేదికగా చేతులెత్తి నమస్కరించిన తెలుగు చిత్ర దర్శకుడు
Sonu Helps Meher Ramesh (Photo-Twitter)

సోనూ సూద్.. పరిచయం అక్కరలేని పేరు.. కరోనా సమయంలో అతను చేసిన సాయానికి అందరూ చేతులెత్తి నమస్కరించారు. దేశం మొత్తం అతనికి నీరాజనాలు పలికింది. తాజాగా తెలుగు దర్శకుడు మెహర్‌ రమేశ్ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ చేసిన సాయానికి (Sonu Helps Meher Ramesh) చేతులెత్తి మొక్కాడు.

దర్శకుడు మెహర్‌ రమేశ్ (Meher Ramesh) వెంకట రమణ అనే రోగి కోసం (P Venkata Ramana) కొన్ని ఇంజక్షన్లు, మెడిసిన్లు కావాలని కోరుతూ సోనూ సూద్ కి ట్వీట్‌ చేశాడు. ఎంత ప్రయత్నించినా అవి సమకూర్చలేకపోయానని, దయచేసి అతడికి సాయం చేయండంటూ సోనూసూద్‌ను (Sonu Sood) అభ్యర్థించాడు.

ఈ విషయంలో మీరు, మీ ఫౌండేషన్‌ మాత్రమే సాయం చేయగలరని ట్విట్టర్లో చేతులెత్తి వేడుకున్నాడు. ఈ ట్వీట్‌ చేసిన 24 గంటల్లో సోనూసూద్‌ (Sonu Sood arranges medicines) ఆ మెడిసిన్స్‌ను దర్శకుడికి అందజేశాడు. దీంతో మెహర్‌ రమేశ్‌ అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. స​కాలంలో వాటిని ఇంత వేగంగా అందించడం మీకు మాత్రమే సాధ్యమైందంటూ ప్రశంసించాడు.

Here's Meher Ramesh Tweets

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు అందరు నటీనటులు టెక్నీషియన్స్ కరోనా పేషెంట్స్ కి అవసరమైన ఐసీయూ బెడ్స్, ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్ల గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కంగనాకు కరోనా పాజిటివ్, వైరస్‌ని నాశనం చేసి పడేస్తానని చెబుతున్నబాలీవుడ్ నటి, రండి కలిసి ఈ వైరస్‌ను నాశనం చేద్దామంటూ పిలుపు

నిజానికి దర్శకుడు మెహర్ రమేష్ అడిగిన టోసిలిజంబ్ 400 mg ఇంజక్షన్ ను నిన్న వైజాగ్ లో 12 లక్షలకు అమ్మారని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా దీని ధర బయట 40 వేలుగా ఉంది. అయితే దీనికి డిమాండ్ ఏర్పడటంతో దాన్ని అందరూ బ్లాక్ లో విక్రయిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on May 09, 2021 03:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).