‘Pushpa 2 – The Rule’:పుష్ప‌రాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వ‌చ్చేసింది! శ్రీ‌లీల స్పెష‌ల్ సాంగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీమ్

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్(Sukumar), ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్'(Pushpa2The Rule). ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. ర‌ష్మిక మందాన్న (Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

‘Pushpa 2 – The Rule’:పుష్ప‌రాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వ‌చ్చేసింది! శ్రీ‌లీల స్పెష‌ల్ సాంగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీమ్
Sreeleela (Photo Credits: @mythriofficial/ Instagram)

Hyderabad, NOV 10: టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్(Sukumar), ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్'(Pushpa2The Rule). ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. ర‌ష్మిక మందాన్న (Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ త‌ప్ప మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్పెష‌ల్ సాంగ్ షూట్ కూడా అయిపోయిన‌ట్లు తెలుస్తుంది.

Sreeleela Joins ‘Pushpa 2’ for the Track ‘Kissik’ 

 

టాలీవుడ్ న‌టి శ్రీలీలను (Sreeleela) ఈ సాంగ్ కోసం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల‌. తాజాగా ఈ మూవీలో శ్రీలీల స్పెష‌ల్ సాంగ్ చేస్తున్న‌ట్లు కొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు మేక‌ర్స్. కిస్సిక్ అనే స్పెష‌ల్ సాంగ్‌లో శ్రీలీల చేయ‌బోతుండ‌గా.. థియేటర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం గ్యారెంటీ అని తెలుస్తుంది.

(The above story first appeared on LatestLY on Nov 10, 2024 07:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).