Cameo Appearance in Kalki 2898 AD: క‌ల్కి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటూ ఈ ఐదుగురి గెస్ట్ అప్పియ‌రెన్స్ మీరు అస్సలు ఊహించి ఉండ‌రు

అయితే, కల్కిలో మృణాళ్‌ ఠాకూర్‌, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రామ్‌ గోపాల్‌ వర్మ (RGV), కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్‌ రోల్స్‌ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం.

Cameo Appearance in Kalki 2898 AD: క‌ల్కి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటూ ఈ ఐదుగురి గెస్ట్ అప్పియ‌రెన్స్ మీరు అస్సలు ఊహించి ఉండ‌రు
Cameo Appearance in Kalki

Hyderabad, June 27: ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌  నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్‌లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్‌ (Prabhas). ఈ సినిమా కోసం భవిష్యత్‌ కాశీ, కాంప్లెక్స్(Complex), శంబల (Shambala) అనే మూడు  ప్రపంచాల్ని  దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అద్బుతంగా క్రియేట్‌ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్‌ (Amitabh), కమల్‌ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్‌ వాయిస్‌  ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి. కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు.

ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ (Dulaqar Salman), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

అయితే, కల్కిలో మృణాళ్‌ ఠాకూర్‌,  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రామ్‌ గోపాల్‌ వర్మ (RGV), కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్‌ రోల్స్‌ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం.

(The above story first appeared on LatestLY on Jun 27, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).