Super Star Krishna Funeral: రేపు సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించనున్న సీఎం జగన్, బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినీనటుడు, స్టార్ హీరో మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినీనటుడు, స్టార్ హీరో మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కృష్ణ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 15, 2022 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

