Darbar Trailer: పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్' ట్రైలర్, యూనిఫాంతో పోటీపడనున్న ఇద్దరు సూపర్ స్టార్స్!

అన్ని బాగానే ఉన్నా ఈ ట్రైలర్ చూస్తే అంతకుముందు వచ్చిన 'పేట' సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం.....

Darbar Trailer: పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్' ట్రైలర్, యూనిఫాంతో పోటీపడనున్న ఇద్దరు సూపర్ స్టార్స్!
Darbar Trailer | Photo: LYCA Productions.

ఈ సంక్రాంతికి ఇద్దరు సూపర్ స్టార్స్ యూనిఫాంతో పోటీపడబోతున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ కమిషనర్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ (Super Star Rajinikanth) 'దర్బార్' తో వస్తుంటే, ఆర్మీ మేజర్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu)  'సరిలేరు నీకెవ్వరు' అని వస్తున్నాడు. ఒకరు బార్డర్ లోపల, మరొకరు బార్డర్ దగ్గర పోరాడే ఆఫీసర్స్‌గా ఈ సంక్రాతికి బాక్సాఫీస్ వద్ద సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ (Darbar)  థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయిపోయి, యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. తలైవా డైలాగ్స్ ఇంటర్నెట్‌లో దుమ్ము ధూళి రేపుతున్నాయి. ఇక ఆయన స్టైల్, యాక్షన్ స్టంట్స్ అన్నీ సూపర్ స్టార్ చరిష్మాకి తగినట్లే ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ముంబై పోలీస్ కమిషనర్‌గా, మాఫియా కంటే బ్యాడ్ అనిపించుకునే విలనీ పోలీస్ ఆఫీసర్‌గా రజినీ 'దర్బార్' లో కనిపించబోతున్నాడు.

ట్రైలర్ ఇదే- DARBAR (Telugu) - Official Trailer:

యాక్షన్ సన్నివేశాలతో పాటు తలైవా రొమాంటిక్ సైడ్‌ను చూడకపోతే అది రజనీకాంత్ సినిమా అనిపించుకోదు. ఈ సినిమాలో రజినీ, లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార (Nayanathara) తో సూపర్ లవ్ ట్రాక్‌ను నడపబోతున్నాడు.

అన్ని బాగానే ఉన్నా ఈ ట్రైలర్ చూస్తే అంతకుముందు వచ్చిన 'పేట' సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం పేట, సాహో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు గుర్తుకుతెస్తాయి. అయితే ఈ సినిమాను ఏ. ఆర్ మురుగదాస్ (AR Murugadoss)  డైరెక్ట్ చేయడం, అందులోనూ వీరిద్దరి కాంబినేషన్ క్రేజీ కావడంతో ఈ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ప్రేక్షకుల అంచనా.

బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి (Suneil Shetty) విలన్‌‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, కునాల్ కెమ్ము, రవి కిషన్ మరియు సౌరభ్ శుక్ల లాంటి స్టార్లు నటిస్తున్నారు. 2020 జనవరి రెండో వారం నుంచి దర్బార్ ఆట ప్రారంభమవుతుంది.

(The above story first appeared on LatestLY on Dec 17, 2019 01:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).